Latest Updates
కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై BRS నేతల ఆగ్రహం – సీఎంపై కేటీఆర్, హరీశ్ రావు ధ్వజం
BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ, “సీఎం అక్రమాలు, మంత్రుల అవినీతిని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని” ఆరోపించారు. పనికిరాని కేసులతో BRS నాయకుల మనోబలాన్ని కుదించలేరని ఆయన స్పష్టం చేశారు.
అటు హరీశ్ రావు కూడా ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ తప్పుడు కేసులతో వేధింపులు కొనసాగిస్తున్నారని విమర్శించారు.