Latest Updates
కొత్తగా పెళ్లైందా.. ఇవి పాటించండి!
కొత్తగా పెళ్లైన దంపతుల జీవితం ఆనందభరితంగా ఉండాలంటే చిన్న చిన్న విషయాలను పాటించడం చాలా ముఖ్యం అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువగా మాట్లాడుకోవడం, భావోద్వేగంగా కనెక్ట్ అవ్వడం దాంపత్య బంధాన్ని బలపరుస్తుందని చెబుతున్నారు. “ఫోన్లు, టీవీ పక్కనపెట్టి కాసేపు భవిష్యత్ లక్ష్యాల గురించి చర్చించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది మంచి మార్గం” అని నిపుణులు అభిప్రాయపడ్డారు.
అలాగే, రోజువారీ పనుల్లో భాగస్వామ్యం అవసరమని సూచిస్తున్నారు. ఒకరు వంట చేస్తే మరొకరు సహాయం చేయడం, కలిసి తినడం వంటి అలవాట్లు దగ్గరితనాన్ని పెంచుతాయని చెబుతున్నారు. కోపం వచ్చినపుడు దాన్ని పక్కన పెట్టి, సహనంతో సమస్యలను పరిష్కరించుకోవడం సంబంధాన్ని మరింత బలంగా నిలిపే మార్గమని మానసిక నిపుణులు పేర్కొన్నారు.
అదేవిధంగా, చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడం, పరస్పర శృంగార ఇష్టాలను గౌరవించడం దంపతుల మధ్య అనుబంధాన్ని గాఢతరం చేస్తాయని సూచించారు. ఈ చిన్న చిన్న అలవాట్లు కొత్త దంపతుల జీవితాన్ని మరింత సంతోషకరంగా, నిలకడగా మార్చగలవని నిపుణులు సలహా ఇస్తున్నారు.