Andhra Pradesh
‘కూలీ’కి రజినీకాంత్ రెమ్యునరేషన్ ఎంతంటే?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కూలీ’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌కు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించగా, సుమారు రూ.350-రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. ఇప్పటికే ట్రైలర్, పాటలు సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్ సాధించడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది.
ఈ ప్రాజెక్ట్‌లో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రజినీకాంత్ తన పాత్రకు గాను రూ.150 కోట్ల భారీ పారితోషికం అందుకున్నట్లు సమాచారం. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ రూ.50 కోట్లు, టాలీవుడ్ స్టార్ నాగార్జున రూ.24 కోట్లు, బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.
మరియు కీలక పాత్రల్లో నటించిన ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్ తలోరూ రూ.4 కోట్ల చొప్పున పారితోషికం అందుకున్నారని సమాచారం. సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్. ఈ లెవెల్‌లో స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నికల్ టీమ్ కలిసిన ‘కూలీ’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.