Health
కూరగాయల వ్యాపారిపై జీఎస్టీ ఝలక్..! రూ.29 లక్షల పన్ను నోటీసుతో కలవరపడిన షాపు యజమాని
కర్ణాటక రాష్ట్రం హవేరిలో ఓ సాధారణ కూరగాయల వ్యాపారికి జీఎస్టీ శాఖ నుంచి భారీ షాక్ తగిలింది. శంకర్ గౌడ అనే వ్యాపారి స్థానికంగా చిన్న కూరగాయల దుకాణం నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజువారీగా వస్తు విక్రయాల్లో ఎక్కువగా కస్టమర్లు యుపీఐ (UPI) ద్వారా చెల్లింపులు చేస్తుండడంతో అతడి ఖాతాలో పెద్ద ఎత్తున లావాదేవీలు నమోదయ్యాయి.
గత నాలుగేళ్లలో యుపీఐ ద్వారా మొత్తం రూ.1.63 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన జీఎస్టీ అధికారులు, దీనిపై ఆయనకు రూ.29 లక్షల పన్ను చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.突
ఈ అభ్యంతరంతో శంకర్ గౌడ్ తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. తాను ప్రతి ఏడూ ఐటీఆర్ఎస్ (Income Tax Returns) ఫైల్ చేస్తున్నానని, చిన్న వ్యాపారి అయిన తనను ఈ స్థాయిలో పన్నులతో వేధించడమా అంటూ ప్రశ్నించారు. అంత పెద్ద మొత్తం తన వద్ద నుంచి ఎలా తేల్చాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని ఎదుర్కొలేక యుపీఐ చెల్లింపులను పూర్తిగా నిలిపివేశానని వెల్లడించారు.
ఈ సంఘటన చిన్న వ్యాపారులు డిజిటల్ చెల్లింపులపై ఎలా గమనించాలో, పన్నుల వ్యవస్థపై మరింత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.