Telangana
కాసేపట్లో భారీ వర్షం!
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది! రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘాలతో నిండిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటలో ఇప్పటికే వర్షం షురూ అయ్యింది. వాతావరణ నిపుణుల సమాచారం ప్రకారం, మరో రెండు గంటల్లో వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక హైదరాబాద్ విషయానికొస్తే, రాజధానిలో కూడా రెండు గంటల తర్వాత వర్షం పడే సూచనలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లే ముందు వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.