Latest Updates
కాళేశ్వరం అవినీతి కేసు CBIకి – బండి సంజయ్ విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి పూర్తిగా BRSనే బాధ్యులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఆయన ట్వీట్ చేస్తూ – “మేము మొదటి నుంచే CBI దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయితే INC ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసింది. చివరికి నిజానికి తలవంచి కేసును CBIకి అప్పగించక తప్పలేదు” అని అన్నారు.
అలాగే ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని, ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం సీరియల్‌లా సాగుతోందని విమర్శించారు.