Andhra Pradesh

కాపు ఉద్యమకారుల కేసులపై అప్పీల్‌కు ఏపీ ప్రభుత్వం నిర్ణయం

కాపు ఉద్యమకారులకు బిగ్ షాక్.. ఆ కేసులపై అప్పీల్‌కు వెళ్లనున్న ప్రభుత్వం |  The government has given a big shock to the Kapu activists

కాపు ఉద్యమకారులపై నమోదైన కేసుల కొట్టివేత తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ముద్రగడ పద్మనాభం సహా పలువురు ఉద్యమకారులపై గతంలో నమోదైన కేసులను విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు, గత ప్రభుత్వం కూడా ఈ కేసులను ఉపసంహరించుకున్న విషయం విదితమే.

అయితే, తాజాగా ఈ కేసులను మళ్లీ అప్పీల్ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం కాపు ఉద్యమకారులతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసులపై అప్పీల్ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version