Latest Updates
కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు దక్కలేదు: మోదీ
కాంగ్రెస్ కారణంగానే పీవోకే మనకు దక్కలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి పొందే చక్కటి అవకాశాన్ని కాంగ్రెస్ వదిలేసిందని విమర్శించారు. “పీవోకేను ఎందుకు తిరిగి తీసుకురాలేకపోయామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కానీ అది ఎవరి పాలనలో పాక్ చేతికి వెళ్లిపోయిందో గుర్తుంచుకోవాలి. 1971 యుద్ధ సమయంలో మన సైన్యం పాక్ భూభాగంలో వేల కిలోమీటర్లు చొచ్చుకెళ్లింది. అప్పుడు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తే పీవోకేను అప్పుడే తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంది” అని మోదీ పేర్కొన్నారు.