News
కష్టం వస్తే కలిసి పోరాడే తత్వం మనది!
అన్యాయాన్ని ఎదిరించి, కష్టాల్లో ఒక్కటై పోరాడే సంప్రదాయం మన తెలంగాణ ప్రజల సొంతం. రాజకీయ పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు భిన్నమైనా, నమ్మకాలు ఏవైనా సరే, అన్నీ మరిచి ఒకే గొంతుకతో ఐక్యంగా నిలబడి తెలంగాణ స్వరాష్ట్ర లక్ష్యాన్ని సాధించాం. తొలి మరియు మలిదశ తెలంగాణ ఉద్యమాలు ఈ స్ఫూర్తికి అద్దం పడతాయి. హైదరాబాద్ నడిబొడ్డున లక్షలాది మంది ఉక్కు పిడికిలి బిగించి, ఒకే గొంతుకతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేశారు. ఈ ఐక్యత, సమిష్టి బలమే మనకు స్వరాష్ట్రాన్ని అందించింది.
ఈ స్ఫూర్తి కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. దేశం కోసం కూడా మనం ఏకమై నిలబడ్డాం. పహల్గామ్ ఘటనలో కూడా మనం ఒక్కటై, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాం. ఈ ఘటన మన సమిష్టి శక్తిని, ఐక్యతను మరోసారి ప్రపంచానికి చాటింది. కష్టం వ్చినప్పుడు కలిసి నిలబడి, అన్యాయాన్ని తరిమికొట్టే ఈ తత్వం తెలంగాణ ప్రజల రక్తంలోనే ఉందని ఈ సంఘటనలు నిరూపించాయి.