Latest Updates
ఓయూలో దివ్యాంగుల రిజర్వేషన్ అమలుపై VHPS నాయకుల నిరసన
ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాల సమయంలో దివ్యాంగుల రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ VHPS (విశ్వ హిందూ పరిషత్ స్టూడెంట్) నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ఈ మేరకు యూనివర్సిటీ వీసీని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా, అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో వారు మెయిన్ గేట్ వద్దే వర్షంలో బైఠాయించి నిరసన తెలిపారు.
వీసీని కలవాలన్న తమ ప్రయత్నాన్ని అడ్డుకున్న విధానంపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌డీ అడ్మిషన్లలో దివ్యాంగులకు హక్కులైన రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించాలని వారు కోరుతున్నారు.