Andhra Pradesh
ఓటీటీలో ‘మయసభ’ అందుబాటులోకి
ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన రాజకీయ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మయసభ’ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు దేవా కట్ట దర్శకత్వం వహించగా, ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ వెబ్‌సిరీస్ విడుదల కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆధారపడిన కంటెంట్
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో గతంలో చోటుచేసుకున్న కొన్ని సంచలనాత్మక వాస్తవిక ఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది. రాజకీయ కుట్రలు, అధికార పోరు, అధికారుల ధీమా, ప్రతిపక్ష నేతల వ్యూహాలు వంటి అంశాలు ఈ కథలో ప్రధానంగా కనిపిస్తాయి. నవరసాలను ఆవిష్కరిస్తూ ముందుకు సాగే ఈ సిరీస్ మొత్తం 9 ఎపిసోడ్లుగా రూపొందించబడింది.
వాస్తవికత, రాజకీయ డైలాగ్స్‌కు హైలైట్
సమకాలీన రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా కథను నడిపిన విధానం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల మద్య జరిగే సంభాషణలు, సభా పరిసరాల్లో జరుగుతున్న మద్యం, ధనబలం వినియోగం వంటి అంశాలు వాస్తవికంగా చూపించబడ్డాయి. ఓటీటీలో రాజకీయ థ్రిల్లర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ‘మయసభ’ కచ్చితంగా ఆసక్తికరమైన ఎంపిక కానుంది.