Connect with us

Latest Updates

ఐబొమ్మ కేసు: ఇమ్మడి రవి అరెస్ట్‌పై ఆయన తండ్రి స్పందనలు ఏమంటే?

ఇమ్మడి రవి అరెస్ట్‌పై స్పందిస్తున్న అతని తండ్రి అప్పారావు – ఐబొమ్మ కేసు నేపథ్యం.

తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఐబొమ్మ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పైరసీ సినిమాలను అందిస్తున్న ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పెద్ద చర్చ నడుస్తోంది. ఐటీ యాక్ట్ మరియు కాపీరైట్ యాక్ట్ కింద పలు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఘటన పెద్ద సెన్సేషన్‌గా మారింది.ఇమ్మడి రవి విశాఖపట్నం వాసి. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. రవి అరెస్ట్ విషయం బంధువుల ద్వారా తెలుసుకున్నానని ఆయన తెలిపారు. “15 ఏళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇలాంటి పనుల్లో ఉంటాడని ఊహించలేదు. నా పెన్షన్‌తోనే నేను జీవిస్తున్నాను” అని అప్పారావు బాధ వ్యక్తం చేశారు. కుమారుడి వ్యక్తిగత జీవితంపై కూడా ఆయన కొన్ని వివరాలు వెల్లడించారు.ఇమ్మడి రవి అరెస్ట్‌పై స్పందిస్తూ ఆయన తండ్రి, “తప్పు చేస్తే చట్టం శిక్షిస్తుందే తప్ప మనం ఏం చెప్పలేం. అతని చేసిన పనికి తగిన చర్యలు తీసుకుంటారు. నేను శిక్షించమని కూడా చెప్పను, వదిలేయమని కూడా చెప్పను” అని స్పష్టంగా చెప్పారు. రవి సంవత్సరాలుగా ఇంటివారి దగ్గరకు ఎక్కువగా రాలేదని కూడా తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం, ఇమ్మడి రవి పైరసీ సైట్ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు అనుమానం. మొత్తం 65 మిర్రర్ వెబ్‌సైట్లు రూపొందించాడని, అతని హార్డ్‌డిస్క్‌లలో 21 వేలకుపైగా సినిమాలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను కూడా ప్రమోట్ చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రవికి చట్టపరంగా కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

Loading