Latest Updates
ఐపీఎల్ 2025: విజేతకు రూ.20 కోట్లు, రన్నరప్‌కు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టుకు రూ.20 కోట్లు, రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. 2022 నుంచి బీసీసీఐ ఈ మొత్తాన్ని విజేత మరియు రన్నరప్ జట్లకు అందిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ప్రైజ్ మనీ మొత్తం క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2008లో తొలి సీజన్లో విజేత రాజస్థాన్ రాయల్స్ (RR) రూ.4.8 కోట్లు, రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ.2.4 కోట్లు అందుకున్నాయి. అప్పటి నుంచి లీగ్ ఆర్థిక వృద్ధితో పాటు ప్రైజ్ మనీ మొత్తాన్ని కూడా బీసీసీఐ నిరంతరం పెంచుతూ వచ్చింది.
ఈ సీజన్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరియు పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు విజేతగా నిలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.