Latest Updates
ఐపీఎల్ 2025: గతంలో హీరో కోసం, ఇప్పుడు హీరోయిన్ కోసం – శ్రేయస్ అయ్యర్ సంచలన రికార్డ్ దిశగా
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. గత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను విజేతగా నిలబెట్టిన శ్రేయస్ అయ్యర్, ఈ సారి పంజాబ్ కింగ్స్‌కు ట్రోఫీ అందించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. ఒకవేళ ఈ ఫైనల్‌లో పంజాబ్ విజయం సాధిస్తే, వరుస సీజన్లలో వేర్వేరు జట్లను టైటిల్ విజేతగా నిలబెట్టిన తొలి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించనున్నారు.
2024 సీజన్‌లో కేకేఆర్ యజమాని, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ జట్టుకు ట్రోఫీ అందించిన అయ్యర్, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాకు మరచిపోలేని కానుకగా టైటిల్‌ను అందించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో అయ్యర్ నాయకత్వ పటిమ, పంజాబ్ జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి నెలకొని ఉంది.