National
ఐఏఎఫ్ వేడుకల్లో పాక్ థీమ్ డిన్నర్ మెనూ – రావల్పిండి టిక్కా నుంచి బాలాకోట్ తిరమీసు వరకు!

భారత వైమానిక దళం (IAF) తన 93వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హిందన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఈ వేడుకలో, డిన్నర్ మెనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఐఏఎఫ్ చేసిన ఆపరేషన్‌లు మరియు పాక్ లక్ష్యాలు ఆధారంగా వంటకాలకు పాకిస్తాన్ నగరాల పేర్లు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. దీనిని ఐఏఎఫ్ యొక్క ధైర్యం, వ్యూహబద్ధతకు ప్రతీకగా చూస్తున్నారు.
మెనూలో:
-
రావల్పిండి చికెన్ టిక్కా మసాలా
-
రఫీకి రహర మటన్
-
భోలారి పనీర్ మేథి మలై
-
సుక్కుర్ కోఫ్తా, జాకోబాబాద్ పులావ్, బహావల్పూర్ నాన్
డెజర్ట్స్: -
బాలాకోట్ తిరమీసు
-
ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా
-
మురిద్కే మీఠా పాన్
ఈ డిన్నర్ మెనూ ద్వారా భారత వైమానిక దళం ఆపరేషన్ సిందూర్, బాలాకోట్ స్ట్రైక్స్ వంటి ఘన విజయాలను వినూత్నంగా ప్రస్తావించింది. ఇది ఒక వైపు వ్యంగ్యంగా కనిపించినా, మరోవైపు దేశ భద్రత కోసం చేసిన త్యాగాలను గుర్తుచేస్తోంది.