Connect with us

Devotional

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట: ఏకసభ్య కమిటీ విచారణకు గ్రీన్ సిగ్నల్!

#తిరుమలలడ్డూకేసు #సుప్రీంకోర్టు #ఏపీప్రభుత్వం #కల్తీనెయ్యివివాదం #తిరుమలప్రసాదం #సుబ్రహ్మణ్యస్వామి #చంద్రబాబునాయుడు #దినేష్కుమార్కమిటీ #ఏపీరాజకీయాలు #శ్రీవారిలడ్డూ #న్యాయస్థానం #టీటీడీ

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీ విచారణను కొనసాగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.ఈ కమిటీ దర్యాప్తు వల్ల సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ (SIT) విచారణకు ఎలాంటి ఆటంకం కలగదని, ఒకటి మరో దానిపై ప్రభావం చూపబోదని ధర్మాసనం అభిప్రాయపడింది. పరిపాలనాపరమైన లోపాలను గుర్తించేందుకే ఈ కమిటీని ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధం కాదని కోర్టు పేర్కొంది.

తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి టెండర్లు, నిబంధనల సడలింపు వంటి అంశాల్లో జరిగిన లోపాలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఈ ఏకసభ్య కమిటీ విచారిస్తోంది. సిట్ ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించి, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. దీనికోసం ప్రభుత్వం 45 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే.ఈ తీర్పుతో తిరుమల లడ్డూ వివాదంలో బాధ్యులెవరో తేల్చే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *