Connect with us

Andhra Pradesh

ఏపీలో కొత్త జోనల్ విధానం : 6 జోన్లు, 2 మల్టీ జోన్లు ప్రకటించిన కేంద్రం

జోన్లు – మల్టీ జోన్ల విభజన

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక విధానాన్ని మరింత స్పష్టంగా, సులభంగా మార్చేలా జోనల్ నిబంధనల్లో సవరణలు చేసింది. పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్–1975ను సవరిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాలను ఆరు జోన్లుగా, వాటిని మరో రెండు మల్టీ జోన్లుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ తాజా మార్పులతో ప్రత్యక్ష ఉద్యోగ నియామకాల్లో స్థానికతకు స్పష్టమైన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. అభ్యర్థులు వరుసగా ఏడేళ్లు చదివిన ప్రాంతాన్ని స్థానిక అర్హతగా పరిగణించనున్నారు. ఇకపై అన్ని నియామకాలు కొత్త గెజిట్ నోటిఫికేషన్ ప్రకారమే కొనసాగనున్నాయి. దీని వల్ల స్థానిక అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కనుంది.

మొదటి మూడు జోన్లను మల్టీ జోన్–1గా గుర్తించారు.

  • 1వ జోన్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి

  • 2వ జోన్: అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ

  • 3వ జోన్: పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా

మిగిలిన మూడు జోన్లను మల్టీ జోన్–2గా ప్రకటించారు.

  • 4వ జోన్: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం

  • 5వ జోన్: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప

  • 6వ జోన్: నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి

రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన కొత్త జిల్లాలకు అనుగుణంగా రెండు కొత్త జోన్లు ఏర్పాటు కావడం గమనార్హం. ఈ వ్యవస్థ అమలుతో రాష్ట్ర స్థాయి కేడర్ అవసరం తగ్గే అవకాశం ఉంది. జూనియర్ అసిస్టెంట్ పై స్థాయి పోస్టులన్నీ జోనల్ కేడర్‌గా పరిగణించనున్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని జోన్ల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

#APGovernmentJobs#ZonalSystem#APRecruitment#LocalQuota#MultiZoneSystem#APGazetteNotification
#GovernmentJobsAP#EmploymentUpdates#APLatestNews#PublicEmploymentOrder

Loading