Andhra Pradesh
ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రయాణీకులకు శుభవార్త
ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేసే దిశగా ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొస్తోంది. ఇప్పటికే ఉన్న కౌంటర్లు, ఏజెంట్లు, అధికారిక వెబ్‌సైట్‌తో పాటు తాజాగా గూగుల్ మ్యాప్స్ మరియు వాట్సాప్ ద్వారా కూడా టికెట్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.
గూగుల్ మ్యాప్స్‌లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణ వివరాలు సెర్చ్ చేస్తే, ఆ మార్గంలో నడిచే ఏపీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ బస్సుల సమాచారం కనిపించనుంది. ప్రయాణ దూరం, ప్రయాణ సమయం, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలతో పాటు అదే ప్లాట్‌ఫామ్‌లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఉదాహరణకు విజయవాడ నుంచి విశాఖపట్నం అని సెర్చ్ చేస్తే బస్సులు, రైళ్లు, ఇతర ప్రయాణ మార్గాల వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి.
అలాగే, వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా ఏపీఎస్ఆర్టీసీ విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. 9552300009 నెంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ రిజర్వేషన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో ఈ సేవను వినియోగించుకోవచ్చు. ప్రయాణ వివరాలు, ప్రయాణికుల సమాచారం నమోదు చేసి ఆన్‌లైన్ పేమెంట్ పూర్తిచేస్తే, టికెట్ వెంటనే బుక్ అయి వాట్సాప్ ద్వారానే అందుతుంది.
వాట్సాప్ బుకింగ్ విధానంపై ప్రయాణీకుల్లో అవగాహన తక్కువగా ఉండటంతో, ఈ సేవను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి పండుగ రద్దీ సమయాల్లో అదనపు బస్సు సర్వీసులను నడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రద్దీ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కొత్త మార్పులతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం మరింత స్మార్ట్‌గా, వేగంగా, సులభంగా మారనుంది.
#APSRTC#APSRCTickets#APSRTCUpdates#GoogleMapsBooking#WhatsAppTicketBooking#ManaMitra#APSRTCDigital
#SmartTravelAP#APSRTCSankranthi#PublicTransportIndia#APTravelNews#BusTicketBooking
![]()
