International

ఎవరి బాధనైనా ఓపిగ్గా వింటారీయన: కెనడాలో ‘లిజనింగ్ టూర్

This man will listen to you talk about anything, and he won't charge a dime  | CBC Radio

మనసులోని బాధను ఎవరితోనైనా పంచుకుంటే కాస్త ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కానీ, ఈ బిజీ జీవన శైలిలో చాలా మందికి తమ గోడును పంచుకునేందుకు సమయం లేదా వ్యక్తి కూడా దొరకడం లేదు. అలాంటి వారి బాధలను ఓపిగ్గా వినేందుకు సిద్ధమైన వ్యక్తి కెనడాకు చెందిన 70 ఏళ్ల రిటైర్డ్ సోషల్ వర్కర్ పౌల్ జెన్కిన్సన్.

పౌల్ జెన్కిన్సన్ కెనడా వ్యాప్తంగా ‘లిజనింగ్ టూర్’ చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎవరి మనసులోని బాధనైనా, ఆందోళననైనా ఓపికగా విని, వారికి మానసిక ఊరటను అందిస్తున్నారు. ఈ అసాధారణ ప్రయత్నం ద్వారా జెన్కిన్సన్ సమాజంలోని ఒంటరి వ్యక్తులకు ఓ స్నేహహస్తం అందిస్తూ, మానవత్వానికి ఓ మచ్చుతునకగా నిలుస్తున్నారు.

ఈ లిజనింగ్ టూర్ ద్వారా జెన్కిన్సన్, ఒకరి బాధను మరొకరు వినడం ఎంత ముఖ్యమో ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఆయన ఈ సేవ సమాజంలో సానుకూల మార్పులను తీసుకొస్తుందని ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version