Latest Updates
ఎమర్జెన్సీకి 50 ఏళ్లు: ఢిల్లీలో బీజేపీ కార్యాలయం వద్ద పోస్టర్ల సందడి
భారత రాజకీయ చరిత్రలో కీలక మలుపుగా నిలిచిన ఎమర్జెన్సీకి ఈరోజుతో 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రత్యేక పోస్టర్లు వెలిశాయి. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ, 1977 మార్చి 21 వరకు కొనసాగింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా గట్టి నిరసనలు, నిర్బంధాలు చోటుచేసుకున్నాయి.
ఈ సందర్భంగా ఈ సాయంత్రం ఢిల్లీలోని ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఎమర్జెన్సీ సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొన్న అణచివేతలను, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిని గుర్తుచేస్తూ ఈ కార్యక్రమం జరగనుంది.