Latest Updates
ఉపరాష్ట్రపతి ఎన్నికలో BC అభ్యర్థి ఎందుకు లేరు?: KTR
ఉపరాష్ట్రపతి ఎన్నికలో మద్దతు కోసం ఎవరూ తమను సంప్రదించలేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. BCల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పే సీఎం రేవంత్.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఓ BC నాయకుడిని ఎందుకు నిలబెట్టలేదని ప్రశ్నించారు. ‘NDA, INDIA కూటముల్లో మేం లేం. ఢిల్లీలో మాకు బాసుల్లేరు. సెప్టెంబర్ 9న ఎన్నిక సమయానికి ఆలోచించి ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయిస్తాం. INC, BJP రెండూ తెలంగాణను ముంచిన పార్టీలే’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.