Andhra Pradesh
“ఉన్మాదుల్ని ప్రోత్సహిస్తున్న జగన్” – టీడీపీ తీవ్ర విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించిన తీరును టీడీపీ తీవ్రంగా ఖండించింది. “ఉన్మాదుల్ని ఖండించాల్సింది పోయి, వారిని ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌ను ఏమనాలి?” అంటూ పార్టీ అధికారికంగా మండిపడింది.
ఒక వైసీపీ కార్యకర్త టీడీపీ నేతలపై “రప్పా రప్పా నరుకుతానన్నా” అన్న వ్యాఖ్యలకు జగన్ సమర్థనగా చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ X (ట్విట్టర్) లో షేర్ చేసింది. “బాబాయిని నరికినట్టు నరికితే మంచిదే అని చెప్పే వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావడం భయానకమే. ఇతని మానసిక స్థితి బాగుందా లేదా అనే ప్రశ్న రావాల్సి వస్తోంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదం రాజకీయ వేడి పెంచింది.