Latest Updates
ఉత్కంఠభరిత పోరులో భారత్ విజయం – సిరీస్ సమం
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. చివరి రోజు ఉదయం దశలోనే తేలిపోయిన మ్యాచ్‌లో భారత్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. విజయం కోసం ఇంగ్లండ్‌కి ఇంకా 35 పరుగులు కావలసి ఉండగా, భారత్‌కి నాలుగు వికెట్లు పడగొట్టాల్సిన పరిస్థితిలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు.
సిరాజ్ ఐదు వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ను కట్టడి చేసి టీమ్ ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. చివరిదశలో అట్కిన్సన్ (17) ధీరంగా పోరాడినప్పటికీ, ఫలితం మాత్రం భారత్‌కే చెందింది. 6 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమిపాలైంది.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసుకుంది. ఒక మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్‌పై ఏ జట్టకీ పైచేయి లేకుండానే ముగిసింది. భారత బౌలింగ్ దళం ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.