Latest Updates
ఈ రోజు మీడియా ముందుకు కవిత – రాజకీయ వాతావరణంపై ఉత్కంఠ
బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ప్రెస్ మీట్‌కి హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే బీఆర్ఎస్ నాయకులపై కవిత ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అంశంపై మరిన్ని విషయాలు బయటపెడతారా? మంత్రి హరీశ్ రావుపై మళ్లీ విమర్శలు చేస్తారా? అన్న అంశాలపై ఉత్కంఠ పెరిగింది.