Business
ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్ (MCLR)ను తగ్గించాయి.
దీంతో ఈ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న కస్టమర్లకు ఉపశమనం లభించనుంది.
PNB అన్ని టెన్యూర్లపై 15 బేసిస్ పాయింట్ల మేర MCLR తగ్గించగా, BOI మాత్రం ఓవర్‌నైట్ రేట్‌ను మినహాయించి మిగతా అన్ని టెన్యూర్లపై 5–15 పాయింట్ల మేర కోత విధించింది.
బ్యాంకింగ్ రంగంలో పోటీని తట్టుకునేందుకు, అలాగే కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.