Devotional
ఈనెల 7న చంద్రగ్రహణం – జాగ్రత్తలు తప్పనిసరి
సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత ఉపఖండంతో పాటు పలు దేశాల్లో ఇది స్పష్టంగా కనిపించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణ సమయం ఆధ్యాత్మికంగా, శారీరకంగా శ్రద్ధ వహించాల్సినదిగా పరిగణిస్తారు. అందువల్ల కొందరు రాశులవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రత్యేకంగా కర్కాటక మరియు కుంభ రాశుల వారు ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరించారు. చంద్రుడిపై రాహు గ్రహం ప్రభావం ఉండటంతో ఈ రాశుల వారికి అవాంఛిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అనవసర వాదనలు, కుటుంబ కలహాలు, మానసిక ఆందోళనలు వంటి ఇబ్బందులు తలెత్తవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.
అయితే గ్రహణం పూర్తయ్యాక పరిహార పూజలు చేయడం ద్వారా ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చంద్రుడికి అభిషేకం చేయడం, రాహువుకు ప్రత్యేక పూజలు చేయడం, అలాగే పేదలకు దానం చేయడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో భక్తులు ఇంట్లో శాంతి పఠనం, దాన ధర్మాలు చేయాలని పండితులు సూచించారు.