International
ఇరాన్ ఎయిర్పోర్టులపై ఇజ్రాయెల్ దాడులు: ఉద్రిక్తతలు తారాస్థాయికి
![]()
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. అమెరికా బాంబుల వర్షం కురిపించిన కొన్ని గంటలకే, ఇజ్రాయెల్ సైన్యం సైతం తన దాడులను ప్రారంభించింది. తాజాగా ఇరాన్‌లోని ఆరు ప్రధాన విమానాశ్రయాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రకటించింది.
ఈ దాడుల్లో 15 ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ధ్వంసమయ్యాయని IDF వెల్లడించింది. మరోవైపు ఈ పరిస్థితులపై సమీక్షించేందుకు అమెరికా జాతీయ భద్రతా బృందంతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ కానున్నారు. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా టెన్షన్ పెరిగిపోతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.