Andhra Pradesh
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు భారీ బోనస్ వార్త
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తొలి త్రైమాసిక బోనస్ ప్రకటించనుందని సమాచారం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా ఈసారి 75 శాతం నుంచి 89 శాతం వరకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా PL4 లెవల్ ఉద్యోగులు తమ రేటింగ్ ఆధారంగా బోనస్ శాతం పొందనున్నారు. కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ఈ బోనస్‌పై ఇప్పటికే లెక్కలు పూర్తి చేసినట్లు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే, ఉద్యోగికి “అవుట్ స్టాండింగ్” రేటింగ్ లభిస్తే గరిష్టంగా 89% బోనస్ వర్తించనుంది. అలాగే, “మెట్ ఎక్స్పెక్టేషన్స్” రేటింగ్ పొందినవారికి 80% వరకు బోనస్ లభించనుంది. ఆశ్చర్యకరంగా, “నీడ్ అటెన్షన్” కేటగిరీలో ఉన్న ఉద్యోగులు కూడా 80% వరకు బోనస్ పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణంగా ఈ రేటింగ్‌లో ఉన్నవారికి తక్కువ శాతం ఇవ్వడం ఆనవాయితీ అయినా, ఈసారి ఇన్ఫోసిస్ కొంత సడలింపు చూపనుందని వార్తలతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
అయితే, ఈ విషయంపై ఇన్ఫోసిస్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లోనే కంపెనీ అధికారికంగా బోనస్‌పై క్లారిటీ ఇవ్వనుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఇన్ఫోసిస్ తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఊరట కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.