Entertainment
ఇదెక్కడి మాస్ రా మావ..! రామ్ చరణ్ పెద్దిలో ఫిల్మీ మోజీ.. థియేటర్స్ దుమ్ములేచిపోవాల్సిందే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు వినగానే అభిమానుల్లో క్రేజ్ పెరిగిపోతుంది. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్, ఆ తర్వాత వచ్చిన గేమ్ ఛేంజర్తో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాడు. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్, స్టార్ స్టడెడ్ కాస్ట్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర సినిమా నిరాశపరిచింది. దీంతో చరణ్ అభిమానులంతా ఇప్పుడు ‘పెద్ది’ సినిమాపైనే నమ్మకాలు పెట్టుకున్నారు.
ఈ భారీ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నాడు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు, రెండో సినిమానే చరణ్‌తో చేసే అవకాశం దక్కించుకోవడం పెద్ద క్రేజే. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ లో చరణ్ లుక్, గ్రామీణ స్టైల్ లోని ప్రెజెంటేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర టచ్‌తో ఈ సినిమా వేరే లెవెల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పెద్ది సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబ్‌లో ఫేమస్ అయిన ‘ఫిల్మీ మోజీ’ టీమ్ ఇప్పుడు ఈ సినిమాకు రంగంలోకి దిగబోతున్నారని టాక్. ఉత్తరాంధ్ర యాస, అక్కడి స్టైల్ డైలాగ్స్ కోసం బుచ్చిబాబు ప్రత్యేకంగా ఫిల్మీమోజీ టీమ్‌ను సంప్రదించారట. ఈ విషయాన్ని ఫిల్మీమోజీ సాయి కిరణ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
“బుచ్చిబాబు గారు మా దగ్గరకు వచ్చి డైలాగ్ రైటింగ్‌లో సహాయం చేయమన్నారు. ఫిల్మీమోజీ షూట్స్ వల్ల పూర్తి స్థాయిలో టైమ్ ఇవ్వలేకపోయినా, కొన్ని డైలాగ్స్‌కు మాత్రం సహాయం చేశాను” అని సాయి కిరణ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇలాంటి మాస్ ఎలిమెంట్స్‌తో ‘పెద్ది’ సినిమా థియేటర్స్‌లో దుమ్ములేపడం ఖాయం అని ఫ్యాన్స్ ఫుల్ హైప్‌లో ఉన్నారు.