Andhra Pradesh
ఇదీ డబుల్ ఇంజిన్ సర్కార్ పవర్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేవలం నినాదం మాత్రమే కాక, ఇది శక్తివంతమైన పాలనకు ప్రతీక అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కేంద్రంతో సమన్వయంగా రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడం దీనివల్ల సాధ్యమవుతుందని ఆయన వివరించారు. “పవర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఇంజిన్ అంత వేగంగా ముందుకు దూసుకుపోతుంది. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రాజెక్టుల పూర్తి వేగంగా జరుగుతుంది,” అని పవన్ చెప్పారు.
రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సాయంతో రూ.430 కోట్లతో ఏకంగా 7 పర్యాటక ప్రాజెక్టులపై పనిచేస్తున్నట్టు వెల్లడించారు. డబుల్ ఇంజిన్ పాలన వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని స్పష్టం చేశారు.