National

ఇది కరెక్ట్ కాదు బ్రదర్..!

ఆర్సీబీ గెలుపు అర్ధరాత్రి అభిమానులు వీరంగం - రోడ్లపైకి వచ్చి బస్సులు,  లారీలు ఎక్కి హల్​చల్​

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడంతో అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకింది. నగర వీధుల్లోకి వచ్చిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. కొందరు యువకులు ఉత్సాహంలో హద్దులు మరచి రోడ్లపై రచ్చ చేశారు. ఓ ప్రాంతంలో సంబరాల సమయంలో అటుగా వస్తున్న ఓ క్యాబ్‌పై ఎక్కి, గెంతులు వేస్తూ వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో క్యాబ్‌కు నష్టం జరిగింది, దీంతో ఆ డ్రైవర్‌కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. రోజూ కష్టపడి ఈఎంఐలు కడుతూ జీవనం సాగిస్తున్న ఆ డ్రైవర్‌కు ఈ సంఘటన ఆవేదన కలిగించింది.

ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సంబరాలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ, అవి ఇతరులకు హాని కలిగించేలా ఉండకూడదని వారు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆర్సీబీ విజయాన్ని ఆనందించాల్సిన సమయంలో ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని, అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కొందరు సూచిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా అభిమానులు జాగ్రత్త వహించాలని, సంబరాలు అందరికీ సంతోషాన్ని పంచేలా ఉండాలని నెటిజన్లు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version