Latest Updates
ఇక నుంచి ఒంటరిగా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు

పర్వతారోహకులకు ఒక పెద్ద షాక్. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై ఎవరెస్ట్ వంటి 8000 మీటర్ల కంటే ఎత్తైన పర్వతాలను ఎక్కడానికి ఒంటరిగా వెళ్లడం అసాధ్యం. కనీసం ఇద్దరు సభ్యులు ఉండే టీమ్‌తో పాటు ఒక మౌంటేన్ గైడ్ తప్పనిసరి.
అదే కాకుండా, ప్రభుత్వము క్లైంబింగ్ ఫీజులను కూడా పెంచింది. మార్చి నుండి మే మధ్య ఎవరెస్ట్ ఎక్కాలంటే ఒక్కో వ్యక్తి రూ.13.2 లక్షలు చెల్లించాలి. ఈ మార్పులు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
![]()
