Connect with us

Environment

ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఖరారు: ఈ నెల ఆఖరులోగా పేదలకు మంజూరు పత్రాలు!

#ఇందిరమ్మఇళ్లు #తెలంగాణప్రభుత్వం #పొంగులేటిశ్రీనివాసరెడ్డి #రేవంత్‌రెడ్డి #హైదరాబాద్వార్తలు #పేదలఇళ్లు #హౌసింగ్పాలసీ #డబుల్బెడ్రూంఇళ్లు #తెలంగాణరాజకీయాలు #ఇళ్లమంజూరు #మౌలికసదుపాయాలు #ప్రభుత్వపథకాలు

హైదరాబాద్‌, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఈ ఫిబ్రవరి చివరి వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.

మంత్రి సమీక్షలో పత్రాల పంపిణీ మూడు కార్పొరేషన్ల పరిధిలోని దాదాపు 28 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల ఆఖరులోగా పత్రాలు అందనున్నాయి,మురికివాడల్లో  స్లమ్ ఏరియాల్లో నివసించే వారు జీవనోపాధి కోసం దూరంగా వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కాబట్టి, వారు అంగీకరిస్తే ఆ ప్రాంతాల్లోనే 5 నుండి 10 అంతస్తుల మేర ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే యోచనలో ప్రభుత్వం ఉంది,డబుల్ బెడ్ రూం ఇళ్ల ఇప్పటికే పూర్తయిన మరియు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు మార్చి నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మౌలిక సదుపాయాలు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయడంతో పాటు, విద్యుత్ మీటర్లను నేరుగా లబ్ధిదారుల పేర్ల మీదకు బదిలీ చేయాలని అధికారులకు సూచించారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి, పది రోజుల్లోగా ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు మరియు లబ్ధిదారుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందించాలని మంత్రి ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన పాత జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం (JNNURM) నివాసాల స్థానంలో కూడా నూతన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *