Connect with us

Latest Updates

ఇండియా-జింబాబ్వే మ్యాచ్: క్రికెట్ ఫ్యాన్స్‌కు చెన్నై మెట్రో అదిరిపోయే గిఫ్ట్!

#భారత్_వర్సెస్_జింబాబ్వే  #చెన్నైమెట్రో  #టీమిండియా #క్రికెట్అప్‌డేట్స్  #ఉచితప్రయాణం  #చెపాక్స్టేడియం #టీ20వరల్డ్ కప్#చెన్నైవార్తలు  #మెట్రోఆఫర్  #ధోనీనగరం  #ఖచ్చితంగాగెలవాలి#క్రీడావార్తలు 

సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే జింబాబ్వేపై గెలుపు తప్పనిసరి. ఇలాంటి ఉత్కంఠభరిత పోరును వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్, మెట్రో సంస్థ సంయుక్తంగా ఈ ఏర్పాట్లు చేశాయి. చెన్నైలో జరగనున్న భారత్ వర్సెస్ జింబాబ్వే కీలక పోరుకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్! స్టేడియానికి వెళ్లే అభిమానుల కోసం చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL) అద్భుతమైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది.మ్యాచ్ టికెట్ ఉంటే చాలు, మెట్రోలో నయా పైసా ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు, అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి,రౌండ్ ట్రిప్ సదుపాయం ఏ స్టేషన్ నుంచైనా గవర్నమెంట్ ఎస్టేట్ స్టేషన్ వరకు వెళ్లి, తిరిగి వచ్చే అవకాశం.

మీ మ్యాచ్ టికెట్‌పై ఉన్న QR కోడ్‌ను మెట్రో స్టేషన్ గేట్ల వద్ద స్కాన్ చేస్తే సరిపోతుంది. ట్రాఫిక్ కష్టాలు లేకుండా, పార్కింగ్ ఇబ్బందులు పడకుండా నేరుగా స్టేడియానికి చేరుకోవచ్చు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సేవలను పొడిగించారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *