Connect with us

Business

ఇండిగో ‘స్ప్లాష్ ఇన్‌టూ సేవింగ్స్’ సేల్: రూ. 1999లకే ఫ్లైట్ టికెట్.. చిన్నారులకు కేవలం రూ. 1 మాత్రమే!

#ఇండిగోఆఫర్ #విమానప్రయాణం #ఫ్లైట్టికెట్లు #తక్కువధర #ట్రావెల్అప్‌డేట్స్ #ఇండిగోస్పెషల్సేల్ #హైదరాబాద్విమానాలు #విహారయాత్ర #ప్రయాణవార్తలు #డిస్కౌంట్లు #ఎయిర్‌లైన్ఆఫర్స్ #టూర్ప్లాన్

సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో ఇండిగో ‘స్ప్లాష్ ఇన్‌టూ సేవింగ్స్’ (Splash into Savings) సేల్‌ను ప్రారంభించింది. ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన దేశీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో భారీ తగ్గింపులను అందిస్తోంది.2026, ఫిబ్రవరి 24 నుండి ఫిబ్రవరి 27 వరకు మాత్రమే,ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకున్న వారు మార్చి 3 నుండి సెప్టెంబర్ 30, 2026 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చు, దేశీయ విమాన టికెట్లు రూ. 1,999 నుండి, అంతర్జాతీయ టికెట్లు రూ. 4,699 నుండి ప్రారంభమవుతున్నాయి.

రూ. 1999 ప్రారంభ ధర కలిగిన కొన్ని ముఖ్యమైన రూట్లు:-హైదరాబాద్ – వడోదరా / సూరత్, బెంగళూరు – ఛత్రపతి శంభాజీనగర్,ఢిల్లీ – లేహ్,పుణె – గోవా,చెన్నై – తిరుచిరాపల్లి,24 నెలల లోపు వయసున్న చిన్నారులకు (Infants) కేవలం రూ. 1 తో ప్రయాణించే అవకాశం కల్పించారు,అదనపు లగేజీపై 50% వరకు, సీట్ సెలక్షన్‌పై 15% వరకు డిస్కౌంట్ లభిస్తుంది,ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుండి ఢాకా మరియు ఖాట్మండు వంటి నగరాలకు రూ. 5000 లోపే టికెట్లు అందుబాటులో ఉన్నాయి,ఈ ఆఫర్లు కేవలం ఇండిగో వెబ్‌సైట్ లేదా అఫీషియల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. వేసవి సెలవుల్లో విహారయాత్రలు ప్లాన్ చేసుకునే వారికి ఇది సరైన అవకాశం.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *