Entertainment
ఆసియా కప్ పాక్తో భారత్ ఆడొద్దు: హర్భజన్
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసియా కప్‌లో భారత్–పాక్ మ్యాచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత, సైనికుల త్యాగం కంటే క్రికెట్ ఏమాత్రం పెద్దది కాదని ఆయన స్పష్టం చేశారు. “ఒక మ్యాచ్ ఆడకపోతే ఏమవుతుంది? క్రికెట్ కంటే దేశం కోసం సైనికులు చేసే త్యాగమే గొప్పది. ఆడితే వారి త్యాగాలను చిన్నబుచ్చినట్లే అవుతుంది” అని హర్భజన్ తెలిపారు. ఈ సీజన్‌లో భారత్–పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఆసియా కప్ సెప్టెంబర్ 5న యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో భాగంగా భారత్–పాక్ జట్లు సెప్టెంబర్ 14న తలపడాల్సి ఉంది. కానీ, ఈ మ్యాచ్ జరిగకూడదనే అభిప్రాయం హర్భజన్ వ్యక్తం చేయడంతో మరోసారి భారత్–పాక్ క్రికెట్ పోరుకు రాజకీయ వాతావరణం ముసురుకుంది. కేవలం క్రీడ మాత్రమే కాకుండా జాతీయ భద్రత, దేశభక్తి వంటి అంశాలు మళ్లీ చర్చకు వస్తున్నాయి.
గతంలో కూడా భారత్–పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లు సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా నిలిచిపోయాయి. కేవలం బహుళజాతి టోర్నీలలో మాత్రమే ఇరుజట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్ మ్యాచ్‌పై హర్భజన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశ గౌరవం ముందు ఏ క్రీడా మ్యాచ్‌కూ విలువ లేదని ఆయన మళ్లీ ఒకసారి గుర్తు చేశారు.