Latest Updates
ఆవును కారులో అపహరించిన ముఠా… హైదరాబాదులో షాకింగ్ ఘటన!
సికింద్రాబాద్ బండిమెట్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో సంచలనకారక ఘటన చోటు చేసుకుంది. ఖరీదైన కారులో వచ్చిన ఓ ముఠా, మోండా మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రెక్కీ చేసిన తర్వాత రోడ్డుపై ఉన్న ఆవుపై మత్తు ఇంజెక్షన్ వేసి అపహరించిన ఘటన కలకలం రేపుతోంది. క్షణాల్లో ఆ ఆవును కుక్కి మరీ కారులో ఎక్కించేసి తీసుకెళ్లిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ఈ దృశ్యాలను పరిశీలించిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బండిమెట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, అపహరణకు పాల్పడిన వారిని గుర్తించే చర్యలు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కారు నంబరును ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికులు ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరగడం చూసినట్లు చెబుతున్నారు.
ప్రజలు ఇప్పటికైనా అధికారులు అపహరణ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరహా అక్రమాలు పశుసంవర్థన నియమాలకు విరుద్ధంగా ఉండటమే కాక, హింసాత్మక చర్యలుగా కూడా పేర్కొంటున్నారు. పశువులను ఎత్తుకెళ్లే ముఠాలపై చర్యలు తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో రైతులు, పశుసంవర్థకులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.