Latest Updates
ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్ మోసాలను అరికట్టేందుకు కేంద్రం రూపొందించిన ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు’కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ప్రభుత్వం పట్టుదలతో బిల్లును ఆమోదింపజేసింది. ఈ బిల్లులో ఈ-స్పోర్ట్స్, సాధారణ ఆన్లైన్ గేమ్స్ మధ్య స్పష్టమైన తేడా చూపించేలా నిబంధనలు రూపొందించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ గేమింగ్ యాప్‌లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దోషిగా తేలితే గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అధికారం ప్రభుత్వం పొందనుంది.