Entertainment
ఆగస్టు 1న యూట్యూబ్‌లోకి ‘సితారే జమీన్ పర్’
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ఆగస్టు 1 నుంచి ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్లో వీక్షించేందుకు అవకాశం కలిగిందని హీరో స్వయంగా ప్రకటించారు. అయితే, సినిమాను చూడాలంటే రూ.100 రెంట్‌గా చెల్లించాల్సి ఉంటుంది అని తెలిపారు.
ఈ చిత్రం జూన్‌లో థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆమిర్ ఖాన్ ఏ ఓటిటికి ఈ సినిమా రైట్స్ ఇవ్వలేదు. అందుకే తన యూట్యూబ్ ఛానల్ ద్వారానే సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తాజా పరిణామంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.