Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త: రూ.20,000 ఆర్థిక సహాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ముఖ్యమైన పథకాన్ని అమలు చేయేందుకు సిద్ధమవుతోంది. అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందించే ఈ పథకాన్ని ఈ నెలాఖరులో ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM కిసాన్ పథకం కింద ఈ నెలలో రూ.2000 జమ కాబోతోంది. అదేరోజు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.5000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలని యోచిస్తోంది.
మొత్తంగా రూ.20,000 అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. రెండో విడతగా అక్టోబరులో రూ.7000, తదుపరి మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో మరో రూ.6000 ఖాతాల్లో జమ చేయనుందని సమాచారం. ఈ నిర్ణయం లక్షలాది మంది రైతులకు ఉపశమనంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు