Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బార్ పాలసీ రూపకల్పనకు శ్రీకారం
ఈ కొత్త పాలసీ పర్యాటక రంగాన్ని మరింతగా ప్రోత్సహించేలా ఉండాలని ఉపసంఘం నిర్ణయించింది. పర్యాటకాన్ని ఆకర్షించే ప్రాంతాల్లో బార్లను స్థాపించేందుకు అనుకూలమైన విధానాన్ని అమలు చేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో టూరిజం శాఖ నుంచి వచ్చిన సూచనలను కూడా పాలసీలో భాగంగా చేర్చాలని ఆదేశించారు. బార్ల అమరిక విషయంలో స్థానిక పర్యాటక వనరులను దృష్టిలో ఉంచుకొని సానుకూల చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్ల విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న కొన్ని బార్లను మరొకచోటికి రీలొకేట్ చేయాల్సిన అవసరంపై కూడా సమావేశంలో చర్చించారని సమాచారం. పారిశ్రామిక మండలాల్లో కొత్త బార్లకు అనుమతులిచ్చే అంశంపైనా పరిశీలన జరగనుంది. త్వరలోనే కొత్త బార్ పాలసీకి తుది రూపం ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.