Latest Updates
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: 120 మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత
అహ్మదాబాద్లో జరిగిన దురదృష్టకర విమాన ప్రమాద ఘటన తర్వాత మృతదేహాల గుర్తింపు మరియు అప్పగింత ప్రక్రియ కొనసాగుతోంది. అధికారుల వివరణ ప్రకారం, ఇప్పటివరకు DNA పరీక్షల ద్వారా 162 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 120 మృతదేహాలను సంబంధిత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘోర విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 241 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో బతికి బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తోందని, చికిత్స కొనసాగుతోందని వైద్య బృందం వెల్లడించింది.