Latest Updates
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నుంచి పాకిస్థాన్కు అదిరిపోయే కౌంటర్!
సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఓ వ్యాఖ్యతో రెచ్చిపోయింది. ‘ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నది నీటిని నిలిపివేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది?’ అని పాకిస్థాన్ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటైన సమాధానం ఇచ్చారు.
హిమంత బిశ్వ శర్మ తన ట్వీట్‌లో ఇలా స్పందించారు: “బ్రహ్మపుత్ర నది ప్రవాహంలో చైనా నుంచి వచ్చే నీరు కేవలం 30-35% మాత్రమే. భారతదేశంలో వర్షాల ద్వారా ఈ నదికి 65-70% నీరు సమకూరుతుంది. మేము ఈ నదిపై పూర్తిగా ఆధారపడం లేదు. ఒకవేళ చైనా నీటిని నిలిపివేసినా, అది మాకు లాభమే. అస్సాంలో వరదలు తగ్గుముఖం పడతాయి.”
ఈ స్పష్టమైన, ధీటైన సమాధానంతో అస్సాం సీఎం పాకిస్థాన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. చైనా నీటిని ఆపినా అస్సాం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని, పైగా అది వరదల నియంత్రణకు ఉపయోగపడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌తో హిమంత బిశ్వ శర్మ పాకిస్థాన్‌కు చురకలు వేశారని చెప్పవచ్చు.