Andhra Pradesh
అనంతపురం జడ్పీ కార్యాలయంలో జగన్ ఫొటోపై TDP MLAల ఆగ్రహం
జిల్లా పరిషత్ (జడ్పీ) కార్యాలయంలోని ఛైర్పర్సన్ గదిలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఫొటో ఉండటంపై తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన అనంతపురం జడ్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది.
TDP ఎమ్మెల్యేలైన ఎంఎస్ రాజు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, సురేంద్ర బాబు ఈ విషయంపై జడ్పీ సీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇది జడ్పీ కార్యాలయమా లేక వైసీపీ ఆఫీసా?” అని ప్రశ్నించారు. జగన్ ఫొటో ఇక్కడ ఉంచడం సరికాదని, అలాంటి ఫొటోలు ఉంచాలనుకుంటే ఛైర్పర్సన్ తమ ఇంట్లో లేదా పూజ గదిలో పెట్టుకోవాలని వారు హితవు పలికారు.
ఈ విషయంపై TDP ఎమ్మెల్యేలు సీఈఓతో తీవ్రంగా వాదించారు. వారి ఆగ్రహానికి స్పందించిన జడ్పీ సిబ్బంది, వెంటనే జగన్ ఫొటోను కార్యాలయం నుంచి తొలగించారు. ఈ సంఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.