Entertainment
‘అఖండ 2’ విడుదలకు బ్రేక్.. కోర్టు ఆదేశాలు.. దిగులులో నందమూరి అభిమానులు
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ 2: తాండవం’ విడుదలపై అనుకోని అడ్డంకి ఏర్పడింది. చిత్రం విడుదలకు ముందురోజే మద్రాస్ హైకోర్టు నుంచి పెద్ద షాక్ వచ్చినట్లు సమాచారం.
ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ తమకు సుమారు రూ. 28 కోట్లు బకాయి పెట్టినట్టు పేర్కొంటూ, ఆ మొత్తాన్ని చెల్లించే వరకు ‘అఖండ 2’ విడుదలను నిలిపివేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, తొలి దశలో ఈరోస్ పక్షాన తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన ఇది వారి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో చిత్రం. 2021లో విడుదలైన బ్లాక్‌బస్టర్ ‘అఖండ’కు కొనసాగింపుగా రూపొందిన ఈ సీక్వెల్ ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌ను పూర్తి చేసుకుని, డిసెంబర్ 5న తెలుగు సహా పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ రాత్రి ప్రీమియర్ షోలు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలోనే విడుదలకు గంటల ముందు ఇలా కోర్టు తీర్పు రావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్–14 రీల్స్ కలిసి ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ వంటి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 14 రీల్స్ వ్యవస్థాపకులు రామ్ ఆచంట, గోపీ ఆచంట విడిగా 14 రీల్స్ ప్లస్ పేరుతో కొత్త బ్యానర్ ప్రారంభించారు. ‘అఖండ 2’ కూడా ఈ కొత్త బ్యానర్‌లోనే రూపొందింది. అయితే పాత సినిమాలకు సంబంధించిన 28 కోట్ల బకాయిలను ఇప్పటికీ క్లియర్ చేయలేదని ఈరోస్ ఆరోపిస్తోంది. అందుకే ‘అఖండ 2’ విడుదలపై ఆంక్షలు విధించాలని వారు కోర్టును ఆశ్రయించారు.
#Akhanda2 #Tandavam #Balakrishna #BoyapatiSrinu #TollywoodNews #FilmIndustry #ErosInternational #14ReelsPlus #MadrasHighCourt #TollywoodUpdates #BreakingNews #MovieReleaseIssue #NBKFans #AkhandaSequel #LatestCinemaNews
![]()
