Latest Updates
అంతర్గత శాంతి ప్రపంచ విధానమవ్వాలి: ప్రధాని మోదీ
విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. యోగా మనిషిని ‘నా’ అనే స్వార్థ భావన నుంచి ‘మనం’ అనే సమష్టి దిశగా నడిపిస్తుందన్నారు. ఇది అంతర్గత శాంతిని కలిగించి ప్రపంచ శాంతికి మార్గం చూపే సాధనమని వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోని 175 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం చిన్న విషయం కాదని, ఇది యోగాకు ఉన్న విశ్వవ్యాప్తిని స్పష్టంగా చూపుతుందన్నారు. “హ్యుమానిటీ 2.0”కి ఈ దినోత్సవం నాంది కావాలని కోరుతూ, యోగా వల్ల క్రమశిక్షణ, మానసిక స్థిరత, శాంతి అలవడుతాయని మోదీ వివరించారు