International
అంతరిక్ష అనుభవం నుంచి భూమిపైకి వచ్చాక ఆధ్యాత్మిక గందరగోళం: శుభాంశు శుక్లా
ఇటీవల అంతరిక్ష ప్రయాణం చేసిన శుభాంశు శుక్లా భూమిపై సాధారణ జీవితం గడపడం ఎంత కష్టమో వివరించారు. భారత్ తరఫున అంతరిక్ష కేంద్రానికి వెళ్లి విజయవంతంగా ప్రయాణం ముగించుకున్న ఆయన, ఇప్పుడు భూమిపై సాధారణ జీవన విధానంలోకి చేరడం కోసం పోరాడుతున్నారు. ‘ఇంకా స్పేస్‌లో ఉన్నాననే అనిపిస్తోంది. నా శరీరానికి ఊపిరి సర్దుకోవడం సవాలుగా మారింది’ అని అన్నారు.
తాజాగా శుభాంశు మాట్లాడుతూ ఓ ఆసక్తికర ఘటనను వెల్లడించారు. “ఒకసారి బెడ్‌పైన కూర్చొని ల్యాప్‌టాప్ ఉపయోగించేవాడిని. అప్పట్లో స్పేస్‌లో ఉన్నట్టే అనిపించి, ల్యాప్‌టాప్‌ను పక్కన విసిరేశాను. అది గాల్లో తేలుతుందనుకున్నా. కానీ వెంటనే నేలపై పడిపోయింది. అప్పుడే గ్రహించాను ఇది భూమి… ఇక్కడ జీరో గ్రావిటీ ఉండదని,” అంటూ నవ్వు పూయించారు. అంతరిక్ష జీవితం ప్రభావం తమ పైన ఎంతగా పడుతుందో ఇది నిదర్శనమని ఆయన చెప్పారు.
ప్రస్తుతం శుభాంశు శుక్లా అమెరికాలో ఉన్నారు. అంతరిక్ష ప్రయాణం ముగిశాక అక్కడే కొంత విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈ నెలలోనే భారత్‌కు తిరిగి రానున్నట్టు సమాచారం. స్పేస్ మిషన్ అనంతర అనుభవాలు, శారీరక, మానసిక స్థితి మార్పులను తీసుకురావడంలో భూమిపై జీవితం ఎంత కష్టమో శుభాంశు మాటల ద్వారా తెలుస్తోంది.