Latest Updates
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా: ‘వందేమాతరం’తో రోదసి యాత్ర ప్రారంభం
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంధర్భంగా, ఆయన హృతిక్ రోషన్, దీపికా పదుకొణె నటించిన ‘ఫైటర్’ సినిమాకు చెందిన దేశభక్తి గీతం ‘వందేమాతరం’ (గాయకుడు: విశాల్ దద్లనీ)ను ఆస్వాదించారు. అంతరిక్ష ప్రయాణానికి ముందు తనకు ఇష్టమైన పాటను ఎంపిక చేసుకునే అవకాశాన్ని శుభాంశు ఎంతో భావోద్వేగంగా ఉపయోగించుకున్నారు.
సాధారణంగా నాసా తరపున వ్యోమగాములకు స్పేస్ మిషన్ ముందు ఒక స్పెషల్ మ్యూజిక్ సెలెక్షన్ ఛాన్స్ ఇస్తారు. శుభాంశు ఎంపిక చేసిన ఈ పాట దేశభక్తిని ప్రతిబింబించడమే కాదు, భారత గర్వాన్ని రోదసి వరకూ తీసుకెళ్లినట్లు మారింది. శుభాంశు శుక్లా స్ఫూర్తిదాయకమైన ఈ ఎంపిక ఇప్పుడు ప్రతి భారతీయ హృదయంలో గర్వం నింపుతోంది.