Latest Updates

హైదరాబాద్: రిటైర్ అయినవారే టార్గెట్.. జాగ్రత్త..!

Cyber Crimes | హైదరాబాదే సైబర్‌ టార్గెట్‌..! వారి అత్యుత్సాహమే  కారణమట..!-Namasthe Telangana

హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల కొత్త టార్గెట్‌గా రిటైర్ అయిన ఉద్యోగులు మారుతున్నారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బును మోసగాళ్లు మాయమాటలు చెప్పి దోచేస్తున్నారు. నారాయణగూడ, బర్కతుర, సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తార్నాక వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పలు కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితులు రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల వివరాల ప్రకారం, ఖాళీగా ఉంటున్న రిటైర్డ్ వ్యక్తులు సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్, ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లను నమ్మి మోసపోతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి వారి బ్యాంక్ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్తున్నారు. ఎక్కువగా డిపాజిట్లు, ఇన్సూరెన్స్, షేర్స్ పేరుతో ఆకట్టుకునే స్కీములు చూపించి మోసాలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానాస్పద కాల్స్, ప్రకటనలను గుడ్డిగా నమ్మొద్దని, డబ్బు పెట్టుబడులకు ముందు తప్పనిసరిగా కుటుంబ సభ్యులు లేదా బ్యాంక్ అధికారులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మోసపోయిన వారు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version