Latest Updates

హైదరాబాద్‌లో పీజీ అభ్యర్థులకు శుభవార్త: CPGET దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నేటి నుంచి

CPGET Application Form 2025 Date (OUT), Registration, Form Link, Last Date,  Fees, How to Apply

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) అధికారులు సంతోషకరమైన వార్త అందించారు. MA, M.Com, M.Sc తదితర పీజీ కోర్సులు మరియు ఐదేళ్ల సంయుక్త కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు.

ఈ దరఖాస్తు ప్రక్రియలో ఒక్కో సబ్జెక్టుకు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు రూ.600 ఫీజుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అదనంగా ఎంచుకునే ప్రతి సబ్జెక్టుకు రూ.450 అదనపు రుసుము చెల్లించాలని స్పష్టం చేశారు. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జులై 17, 2025గా నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version